కోదాడ, ఫిబ్రవరి 21 : అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం పురస్కరించుకుని మూడు నిమిషాల నిడివి గల చిత్రాల పోటీలో కోదాడ పట్టణానికి చెందిన చిన్నారులు కోటమర్తి ధ్రువ రాఘవేంద్ర, పాలకుర్తి శ్రీ వర్ణికలు నటించిన గడప, తెలుగుదనం లఘు చిత్రాలకు పురస్కారం లభించింది. శనివారం విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రపంచ తెలుగు కవుల మహాసభలో శాలువా, ప్రశంస పత్రంతో సత్కరించారు. దీంతో పాటు కోదాడ పట్టణానికి చెందిన ప్రముఖ నవలా రచయిత్రి కోటమర్తి రాదా హిమబిందును కూడా ఘనంగా సత్కరించారు. పురస్కారం అందుకున్న ధ్రువ రాధా హిమబిందు మనవడు అవడం, ఇద్దరూ ఒకే వేదికపై సత్కారం పొందడం విశేషం. కాగా ఈ పురస్కార పోటీకి 375 ఎంట్రీలు రాగా 13 లఘు చిత్రాలు ఎంపికయ్యాయి.