Home
Business
Avenue Supermarts Which Operates Retail Outlets Under The D Mart Brand Has Announced Promising Financial Results
డీ-మార్ట్ లాభం 743 కోట్లు
డీ-మార్ట్ పేరుతో రిటైల్ అవుట్లెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.743 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
బెంగళూరు, అక్టోబర్ 10: కిందటేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.684.85 కోట్ల లాభంతో పోలిస్తే 8.5 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 17.8 శాతం ఎగబాకి రూ.19, 644 కోట్లకు చేరుకున్నట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది.
గత త్రైమాసికంలో కొత్తగా 15 స్టోర్లను ప్రారంభించడంతో మొత్తం సంఖ్య 518కి చేరుకున్నాయని కంపెనీ ఎండీ అన్షుల్ అసవా తెలిపారు. సమీక్షాకాలంలో నిర్వహణ ఖర్చులు ఏడాది ప్రాతిపదికన 18 శాతం ఎగబాకి రూ.18,632.70 కోట్లకు చేరుకున్నట్లు, ఇదే సమయంలో సంస్థ మొత్తం ఆదాయం అన్ని కలుపుకొని రూ.19,657.54 కోట్లకు చేరాయని వెల్లడించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

