న్యూఢిల్లీ, డిసెంబర్ 20 : ప్రపంచవ్యాప్తంగా 2021లో ప్రతి 127 మందిలో ఒకరికి ఆటిజం ఉందని ప్రపంచ వ్యాధుల భారం(జీబీడీ) అధ్యయనం అంచనా వేసింది. 20 సంవత్సరాల లోపు యువతలో ప్రాణాంతకం కాని పది అనారోగ్య కారణాల్లో ఆటిజం ఒకటని తెలిపింది. ఆటిజం ఉన్నవారు ప్రవర్తన పరంగా, సామాజిక నైపుణ్యాల పరంగా వెనకబడి ఉంటారు. లాన్సెట్ సైకియాట్రి జర్నల్లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి లక్ష మంది పురుషుల్లో 1,065 ఆటిజం కేసులు నమోదవగా, మహిళల్లో 508 మంది ఈ వ్యాధితో బాధ పడుతున్నారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఆటిజం బాధితులు ఎక్కువగా ఉన్నారు.