టీ20 వరల్డ్ కప్ 2021లో ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించింది. న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఇంకా 7 బంతులు మిగిలి ఉండగానే గెలిచింది.
ఆస్ట్రేలియా ఆటగాళ్లలో మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్.. భారీ స్కోర్లు నమోదు చేశారు. ఇద్దరూ హాఫ్ సెంచరీ చేసి ఆస్ట్రేలియాను గెలిపించారు. డేవిడ్ వార్నర్ 38 బంతుల్లో 53 పరుగులు చేసి నాలుగు ఫోర్లు, 3 సిక్సులు బాది పెవిలియన్ చేరాడు. అంతకుముందే కెప్టెన్ ఆరున్ ఫించ్.. 7 బంతుల్లో 5 పరుగులు చేసి క్యాచ్ అవుట్ అయ్యాడు.
ఇద్దరూ అవుట్ అయ్యాక.. మార్ష్, మ్యాక్స్‌వెల్.. ఇద్దరూ బాగా రాణించి ఎక్కువ పరుగులు చేశారు. అలాగే ఆస్ట్రేలియాను గెలిపించారు. మార్ష్ 50 బంతుల్లో 77 పరుగులు చేసి 6 ఫోర్లు, 4 సిక్సులు బాది నాట్ అవుట్‌గా నిలిచాడు. మ్యాక్స్‌వెల్ 18 బంతుల్లో 28 పరుగులు చేసి నాట్ అవుట్‌గా నిలిచాడు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 4 ఓవర్లు వేసి 18 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.
టీ20 వరల్డ్ కప్ 2021 టైటిల్‌ను ఎలాగైనా గెలవాలని బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు ఈసారి కూడా నిరాశే ఎదురైంది. తొలిసారి టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో అడుగుపెట్టిన న్యూజిలాండ్ ఈసారి ఎలాగైనా కప్పు కొడుతుందని ఎక్కువ శాతం క్రికెట్ అభిమానులు భావించారు. కానీ.. ఈసారి కూడా న్యూజిలాండ్‌కు కప్ దూరమైంది. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ భారీ పరుగులు వృథా అయిపోయాయి.
ముందుగా ఊహించినట్టుగానే.. దుబాయ్ స్టేడియంలో టాస్ గెలిచిన జట్టుకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అందరూ భావించారు. అదే ఆస్ట్రేలియాకు కలిసి వచ్చింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకొని ఛేజింగ్‌కే ప్రాధాన్యత ఇచ్చింది. అదే ఆస్ట్రేలియాకు తొలి టీ20 వరల్డ్‌కప్ టైటిల్‌ను అందించింది.
ఆస్ట్రేలియా ప్లేయర్ మిచెల్ మార్ష్‌ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. 50 బంతుల్లో 77 పరుగులు చేసి ఆస్ట్రేలియాను గెలిపించినందుకు మార్ష్‌కు ఐసీసీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చింది.
ఆస్ట్రేలియా ఆటగాడు.. డేవిడ్ వార్నర్‌ను మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ వరించింది. 38 బంతుల్లో 53 పరుగులు చేయడంతో పాటు.. టీ20 వరల్డ్ కప్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆస్ట్రేలియా ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. దీంతో డేవిడ్ వార్నర్‌కు ఐసీసీ మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును అందించింది.
Australia are the 𝐖𝐈𝐍𝐍𝐄𝐑𝐒 of the #T20WorldCup 2021 🏆#T20WorldCupFinal | #NZvAUS | https://t.co/50horpfG97 pic.twitter.com/JYKoseZTWl
— ICC (@ICC) November 14, 2021
👑 𝑪𝑯𝑨𝑴𝑷𝑰𝑶𝑵𝑺 👑 #T20WorldCup #T20WorldCupFinal pic.twitter.com/ip8vSnupO7
— T20 World Cup (@T20WorldCup) November 14, 2021
🎉 As each game came and went Australia have only gotten better and tonight get to celebrate and basque in winning the #T20WorldCupFinal@RoyalStagLil | #InItToWinIt | #T20WorldCup pic.twitter.com/xaCwwydxgN
— ICC (@ICC) November 14, 2021
💪 Hugs all round as the fans celebrate Australia winning the #T20WorldCupFinal @oppoindia shot of the day | #T20WorldCup pic.twitter.com/GbIeXSakVR
— ICC (@ICC) November 14, 2021