రావల్పిండి: సుదీర్ఘ విరామం అనంతరం పాకిస్థాన్‌లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా.. ఆచితూచి ఆడుతున్నది. తొలి ఇన్నింగ్స్‌లో పాక్ 4 వికెట్ల నష్టానికి 476 పరుగులు చేసి డిక్లేర్ చేయగా.. ఆసీస్ దీటుగా బదులిస్తున్నది. ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 271/2 వద్ద నిలిచింది. ఉస్మాన్ ఖవాజా (97; 15 ఫోర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ (68; 12 ఫోర్లు), లబుషేన్ (69 బ్యాటింగ్; 9 ఫోర్లు) రాణించారు. పాక్ బౌలర్లలో సాజిద్, నౌమాన్ చెరో వికెట్ పడగొట్టారు. ఫ్లాట్ పిచ్‌పై పాక్ బ్యాటర్లు పరుగుల పండుగ చేసుకోగా.. దాన్ని సద్వినియోగం చేసుకున్న ఆసీస్ కూడా భారీ స్కోరు దిశగా సాగుతున్నది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్‌లో చేతిలో 8 వికెట్లు ఉన్న ఆసీస్.. పాక్ స్కోరుకు 205 పరుగులు వెనుకబడి ఉంది.