అరబిందో ఫార్మా ప్రాఫిట్ డౌన్
- క్యూ2లో 13 శాతం తగ్గిన లాభం

హైదరాబాద్, నవంబర్ 8: హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న అరబిందో ఫార్మా లాభాలకు ముడి సరుకుల ధరలు గండికొట్టాయి. గత త్రైమాసికపు కన్సాలిడేటెడ్ నికర లాభంలో 13.69 శాతం తగ్గింది. 2020-21లో రెండో త్రైమాసికంలో రూ.807.25 కోట్లుగా ఉన్న లాభం గత త్రైమాసికానికిగాను రూ.696.71 కోట్లకు పడిపోయింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.6,483.44 కోట్ల నుంచి రూ.5,941.92 కోట్లకు తగ్గింది. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ ఎన్ గోవిందరాజన్ మాట్లాడుతూ..గత త్రైమాసికంలో అన్ని విభాగాలు భారీ వృద్ధిని నమోదు చేసుకున్నాయని, క్రమంగా ఫార్మా రంగం కుదుటపడుతున్నదన్నారు. ముడి సరుకుల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుండటం, లాజిస్టిక్ ఖర్చు లు కూడా అధికమవడం వల్లనే లాభాలపై ప్రభావం చూపిందన్నారు. అమెరికాలో ఔషధాల విక్రయించడంతో రూ.2,967 కోట్లు, యూరప్‌లో రూ.1,662 కోట్లు, ఇతర అభివృద్ధి చెందిన మార్కెట్ల నుంచి మాత్రం రూ.386.30 కోట్ల ఆదాయం సమకూరింది. మరోవైపు, ప్రతిషేరుకు రూ.1.50 మధ్యంతర డివిడెండ్‌ను బోర్డు ప్రకటించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

