ఎదులాపురం, ఫిబ్రవరి 25 : ఆదిలాబాద్ పట్టణ శివారులోని ఖానాపూర్ ప్రాంతంలోని ఆర్ఆర్ ఫుడ్ ప్రొడక్ట్ కేంద్రంపై శుక్రవారం పోలీ సులు, అధికారులు దాడి చేసి సీజ్ చేశారు. పెట్రో లింగ్ నిర్వహిస్తున్న క్రమంలో పోలీస్ సిబ్బంది గోదాం వైపు పరిశీలించి చూశారు. అక్క డి నుంచి దుర్వాసన రావడంతో కుళ్లిపోయిన ఎల్లిగడ్డలు, ఎండిపోయిన అల్లాన్ని పరిశీలించారు. ఈ విషయాన్ని పోలీస్ సిబ్బంది వెంటనే వన్‌టౌన్ సీఐ ఎస్ రామకృష్ణకు సమాచారం అందించగా ఆయన డీఎస్పీ వెంకటేశ్వరరావు, మున్సిపల్ శాని టరీ ఇన్స్పెక్టర్ నరేందర్‌కు వివరించారు. వారు కలిసి అక్కడికి చేరుకున్నారు. తయారీ కేంద్రంలో చేస్తున్న వాటిని పరిశీలించారు. ఎండిపోయిన అల్లం, కుళ్లిపోయిన ఎల్లిగడ్డలతో కల్తీ అల్లం వెల్లుల్లి ఫేస్టును తయారు చేసి అందంగా కనబడే లా ప్యాకింగ్ చేసి ఆదిలాబాద్‌లోని మార్కెట్లో విక్రయిస్తుంటారు. తయారు చేస్తున్నట్లు అనుమ తి పత్రం ఉందా అని యజమాని సిరాజ్ హైమద్ ను అడిగారు. కేవలం ఆహార తనిఖీ అధికారి జారీ చేసిన పత్రం ఉందని బదులు ఇచ్చారు. మున్సిపల్ శాఖ ద్వారా, సివిల్ సప్లయ్ తో పాటు మరి కొన్ని అనుమతి పత్రాలు లేకపోవడంతో అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఆర్ఆర్ ఫుడ్ ప్రొడక్ట్‌లో పెద్దఎత్తున కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టుతోపాటు యంత్రాలు, గోదాంను తహసీల్దార్ భోజన్న ఆదేశాల మేరకు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.