ATA | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్‌ను అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా ) బృందం కలిసింది. 2026 జూలై 31, ఆగస్టు 1, 2వ తేదీల్లో
అమెరికా మేరీల్యాండ్‌లో నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) తెలుగు మహాసభలకు హాజరుకావాల్సిందిగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆహ్వానించింది.
ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల ఆటా సభల సందర్భంగా చేపట్టే కార్యక్రమాలను కేటీఆర్‌కు వివరించారు. ఈ సందర్భంగా అమెరికాలోని భారతీయుల పరిస్థితులు, రాజకీయాలపై చర్చించారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు జయంత్ చల్లా, నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ తిరుమల రెడ్డి, ఈశ్వర్ రెడ్డి బండా పాల్గొన్నారు. ఆటా మహా సభలకు హాజరయ్యేందుకు కేటీఆర్ సానుకూలంగా స్పందించారు.
తెలంగాణ ఉద్యమంలో NRIల పాత్ర , తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ కార్యక్రమాలపై కేటీఆర్ చర్చించారు. అప్పటి TDF చైర్మన్ మధు రెడ్డి నల్లగొండ ఫ్లోరైడ్ పోరాటంలో మద్దతు ఇచ్చిన విషయం కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో NRIలు ప్రజలకు అమెరికాలో ఉండి కూడా ఎలా మద్దతు కూడ గట్టారో వివరించారు. శరత్ వేములతో రెండు దశాబ్దాలుగా తనకు ఉన్న ఉద్యమ సంబంధాన్ని జ్ఞప్తి చేసుకున్నారు కేటీఆర్. పదేళ్ల BRS పాలనలో రాష్ట్రం దేశానికి తలమానికంగా నిలిచింది అని చెప్పారు.
This Weekend OTT | ‘జెట్ లీ’, ‘కర’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన వెబ్ సిరీస్‌లు, సినిమాలివే!
Rajamouli | ‘వారణాసి’కి మళ్లీ లీకుల బెడద.. జక్కన్న మౌనం వెనుక అసలు వ్యూహం ఏంటి?
Transgender Influencer: మున్నిపల్ ఎన్నికల్లో గెలిచిన ట్రాన్స్‌జెండర్ ఇన్ఫ్లూయెన్సర్