ఖార్తోమ్: సూడాన్‌లో అరబ్ సంచార జాతులు, జీబెల్ తెగకు మధ్య జరిగిన ఘర్షణల్లో 43 మంది మరణించారు. 46 గ్రామాలు తగలబడటమే కాకుండా లూటీకి గురయ్యాయి. పలువురి ఆచూకీ లభించడం లేదు. ఈ ఘర్షణ పశ్చిమ డార్ఫర్ పరిధిలోని జీబెల్ మూన్ ప్రాంతంలో ఈ నెల 17న చోటుచేసుకొనగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి డార్ఫర్ రీజియన్‌లో 2003 నుంచే అంతర్యుద్ధం కొనసాగుతున్నది. ముఖ్యంగా ఆర్థిక వెనుకబాటు, ఆహార కొరతనే ఈ అంతర్యుద్ధానికి కారణంగా మారింది.