తరాలు మారినా ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ అనుభూతి మాత్రం గొప్పదే. ‘క్వాక్ క్వాక్’ అనే డేటింగ్ యాప్ తాజా సర్వే ఆ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. సర్వేలో పాల్గొన్నవారిలో దాదాపు 73 శాతం మంది తొలిచూపులోనే ప్రేమలో పడినట్టు చెప్పారు. తొలిచూపులో పుట్టేది నిజమైన ప్రేమ కాకపోయినా.. మోహం, ఇష్టం, అందం, వ్యక్తిత్వం వంటివి ఆ ఆకర్షణకు కారణాలు అవుతాయని 53 శాతం మంది ఒప్పుకొన్నారు. ఓ వ్యక్తితో మనం కలిసి చేసే ప్రయాణం, గడిపే సమయం ప్రేమ విజయానికి మూలమని 60 శాతం మంది బలంగా నమ్మారు. కానీ, జీవితకాలం నిలబడిన ప్రేమలలో.. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ప్రేమికులతో పోలిస్తే తొలి పరిచయం కాస్తా స్నేహంగా మారి, స్నేహం కాస్తా ప్రేమగా ముదిరి ఆ తర్వాత పెద్దల అనుమతితో ఒక్కటైనవే ఎక్కువ.