హైదరాబాద్ (సిటీబ్యూరో), మార్చి 5 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా డాటా సేవలు అందిస్తున్న ‘కంట్రోల్ ఎస్’కి అసోచామ్ అవార్డు లభించింది. ఇప్పటికే ఆసియా ఖండంలోనే అతి పెద్ద గ్యాస్ ఇన్సులేటెడ్ స్టేషన్ను నిర్మించి 24 గంటల పాటు ఎలాంటి అంతరాయం లేకుండా ఐటీ కంపెనీలకు డాటా సేవలను అందిస్తున్నది కంట్రోల్ ఎస్ డాటా సెంటర్స్.