ఆత్మకూర్.ఎస్, డిసెంబర్ 27 : మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలనే డిమాండ్‌తో ఈ నెల 29వ తేదీన నిర్వహించే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కేశబోయిన మల్లయ్య యాదవ్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన స్పందిస్తూ.. 2019 నుండి 2024 వరకు గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు బిల్లులు చేసినవి రెండు సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా తాజా మాజీ సర్పంచులు ముట్టడి కార్యక్రమం విజయవంతం చేయాలని ఆయన కోరారు.