లండన్, మార్చి 23: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే తన దీర్ఘకాల సహచరిణి, న్యాయవాది స్టెల్లా మోరిస్‌ను వివాహమాడారు. ప్రస్తుతం ఆయన ఉన్న ఆగ్నేయ లండన్‌లోని బెల్మార్ష్ జైల్లో భారీ భద్రత మధ్య ఉదయం విజిటింగ్ అవర్స్ సమయంలో ఈ కార్యక్రమం జరిగింది. నలుగురు అతిథులు మాత్రమే హాజరయ్యారు. 50 ఏండ్ల అసాంజే, 38 ఏండ్ల స్టెల్లాకు ఇప్పటికే ఇద్దరు కుమారులు ఉన్నారు.