తల నరికేసి ఆ తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు
గౌహతి: అస్సాంలో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. తోటి గ్రామస్థుడిని తల నరికేసి.. ఆ తలను పట్టుకుని 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. సోనిపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున స్థానికంగా ఫుట్‌బాల్ మ్యాచ్‌లు నిర్వహించారు. అయితే ఆ మ్యాచ్‌పై ఇద్దరు మిత్రులు తునిరామ్ మాద్రి, బెయిలా హేమ్రామ్లు బెట్టింగ్ కట్టుకున్నారు. మ్యాచ్ ఓడిన వాళ్లు గెలిచిన వాళ్లకు రూ.500 ఇవ్వాలని బెట్ వేశారు. అయితే బెట్టింగ్‌లో హేమ్రామ్ గెలిచాడు. తనకు 500 ఇవ్వాలంటూ తునిరామ్ మాద్రిని కోరారు. కానీ తునిరామ్ డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించాడు. అయితే హేమ్రామ్ పదేపదే బెట్టింగ్ డబ్బులు కోరడంతో.. కోపం వచ్చిన తునిరామ్ మాద్రి తన వద్ద ఉన్న మచ్చు కత్తితో హేమ్రామ్ తలను నరికేశాడు. తలతో 25 కిలోమీటర్ల దూరం నడిచి అక్కడి స్థానిక పోలీసు స్టేషన్లో అతను లొంగిపోయాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ప్రజలకు చేరువైన పాలన
పోరాటాల గొంతుక సుద్దాల హనుమంతు.. నివాళులర్పించిన సీపీఐ నేతలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

