దోహ: భారత స్టార్ క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ ఎనిమిదోసారి ఆసియా బిలియార్డ్స్ టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు. శనివారం జరిగిన తుదిపోరులో ధ్రువ్ సిత్వాలాపై పంకజ్ విజయం సాధించాడు. ఓవారల్గా అద్వానీకి ఇది 24వ అంతర్జాతీయ బిలియార్డ్స్ టైటిల్ కావడం విశేషం. అంతకుముందు సెమీఫైనల్లో పంకజ్ 5-4తో పౌక్ సాపై గెలిచాడు.