ముంబై: మరో పది రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 14వ సీజన్ ఆరంభంకానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్లో పాల్గొనే ఆటగాళ్లందరూ ఆయా జట్లలో చేరుతున్నారు. తాజాగా భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ హెట్‌మైర్ ముంబైలో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ బసచేస్తున్న హోటల్లో చేరారు. ఆటగాళ్లందరూ వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉంటారని ఫ్రాంఛైజీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇంగ్లాండ్ పేసర్ క్రిస్‌వోక్స్ కూడా ఢిల్లీ జట్టులో చేరేందుకు ముంబైకి వచ్చేశాడు.
బీసీసీఐ నిబంధనల ప్రకారం ముందుగా ఆటగాళ్లు, కోచింగ్, సహాయ సిబ్బంది అందరూ వారం రోజుల పాటు తప్పనిసరి క్వారంటైన్లో ఉండాలి. ఆ తర్వాత నిర్వహించిన టెస్టుల్లో కరోనా నెగెటివ్‌గా వచ్చిన వారిని మాత్రమే టీమ్ బయో బబుల్‌లోకి అనుమతిస్తారు. అనంతరం ప్రాక్టీస్ చేసేందుకు అవకాశం ఉంటుంది.
🎶 Guess who's back? Back again 🎶
— Delhi Capitals (@DelhiCapitals) March 29, 2021
Welcome, @SHetmyer 😁#YehHaiNayiDilli #IPL2021 @TajMahalMumbai pic.twitter.com/21J3lsmcNp