మంచిర్యాల : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడామైదానంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీలలో కోటపల్లి విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు (State Level Selections ) ఎంపికయ్యారు.
గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల 9వ తరగతి చదువుతున్న పారిపెల్లి సుప్రియ( Supriya) అండర్ 18 విభాగంలో జావేలిన్ త్రో ( Javelin throw ) లో బంగారు పతకం, 8వ తరగతి చదువుతున్న నాయిని శ్రీనిజ( Sreenija ) అనే విద్యార్థిని అండర్ 14 విభాగం లో 100 మీటర్లు, 400 మీటర్లు పరుగు పందెంలో రెండు బంగారు పతకాలు సాధించినట్లు వివరించారు.
ఈ నెల 23 న హైదరాబాద్ లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో వీరు విద్యార్థులు పాల్గొననున్నారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన పాఠశాల విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు అశోక్, మధునయ్య, వ్యాయమ ఉపాధ్యాయుడు శ్రీకాంత్, ఉపాధ్యాయులు లావణ్య, తోటి ఉపాధ్యాయులు అభినందించారు.