హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 1 (నమస్తే తెలంగాణ): అరుణ్‌సాగర్ విశిష్ట పురస్కారాల ప్రదాన కార్యక్రమం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఉదయం 10.30 గంటలకు జరుగనున్నది. విశిష్ట సాహిత్య పురస్కారం ప్రముఖ కవి, విమర్శకుడు ప్రసాదమూర్తికి, విశిష్ట పాత్రికేయ పురస్కారం ఈనాడు ఎడిటర్ ఎం నాగేశ్వర్రావుకు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ కట్టా శేఖర్‌రెడ్డి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, అందోల్ ఎమ్మెల్యే సీహెచ్ క్రాంతికిరణ్ హాజరుకానున్నారు. సభాధ్యక్షుడిగా తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వ్యవహరించనుండగా.. విశిష్ట అతిథులుగా సరస్వతీ సమ్మాన్ పురస్కార గ్రహీత కే శివారెడ్డి, టీఎస్పీఎస్సీ మాజీ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, టీవీ 5 చైర్మన్ బీఆర్ నాయుడు హాజరుకానున్నారు. ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే శ్రీనివాస్ స్మారకోపన్యాసం చేస్తారు. అరుణ్‌సాగర్ ట్రస్ట్-మువ్వా శ్రీనివాసరావు, రాజ్‌కుమార్ ముప్పనేని, వైజే రాంబాబు, టీ జగన్మోహన్ సభను నిర్వహించనున్నారు.