కోల్‌కతా: ఇండియన్ మాజీ క్రికెటర్ అరుణ్ లాల్ రెండవ పెళ్లి చేసుకున్నారు. స్నేహితురాలు బుల్బుల్ సాహను ఆయన పెళ్లాడాడు. కోల్‌కతాలో ఈ వేడుక జరిగింది. కొన్నాళ్ల నుంచి ఇద్దరి మధ్య డేటింగ్ నడుస్తోంది. అరుణ్ లాల్ వయసు 66 ఏళ్లు. అయితే మొదటి భార్య రీనాతోనే అరుణ్ లాల్ ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఈ నేపథ్యంలో ఆమె అనుమతితోనే అరుణ్ లాల్ రెండవ పెళ్లి చేసుకున్నాడు. అరుణ్ కన్నా రెండవ భార్య 28 ఏళ్లు చిన్నది. ఆమె టీచర్‌గా పనిచేస్తోంది. మే 2వ తేదీన జరిగిన పెళ్లి ఫోటోలను ఆమె తన ఫేస్బుక్లో పోస్టు చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
అరుణ్ లాల్ ప్రస్తుతం బెంగాలీ రంజీ టీమ్‌కు కోచ్‌గా ఉన్నారు. రైట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా ఇండియాకు ఆడాడు. 1982లో శ్రీలంకతో చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో ఆయన ఎంట్రీ ఇచ్చాడు. భారత్ తరపున మొత్తం 16 టెస్టులను అరుణ్ ఆడాడు. వాటిల్లో 729 రన్స్ చేశాడు. అత్యధికంగా 93 కొట్టాడు. 1989లో వెస్టిండీస్‌తో చివరి టెస్ట్ ఆడాడతను. ఇండియా తరపున 13 వన్డేలు కూడా అరుణ్ ఆడాడు. దేశవాళీ క్రికెట్లో అరుణ్ లాల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. రంజీల్లో ఆయన 53.23 సగటుతో 6760 రన్స్ చేశాడు.