వనపర్తి, మార్చి 16 (నమస్తే తెలంగాణ) : ఈత సర దా ప్రాణాలను బలిగొన్నది. కన్నవాళ్లకు కడుపుకోత మి గిల్చింది. సరదాగా మిత్రులతో కలిసి ఈతకు వెళ్లిన ము గ్గురు విద్యార్థులు జల సమాధి కావడంతో వనపర్తి జి ల్లా కేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సో మవారం సాయంత్రం 9 మంది విద్యార్థులు పట్టణంలోని ఈదుల చెరువులో స్నానం చేసేందుకు వెళ్లారు. స్నానం చేసే క్రమంలో ఈత రాక ముగ్గురు విద్యార్థులు మునిగిపోయారు. మిగతా వారు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. రాత్రి పొద్దుపోయాక సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈతగాళ్లతో విద్యార్థుల కోసం గాలింపు చేపట్టగా ఏండీ మున్నా (16), 8వ తరగతి చదువుతున్న అస్మద్ (14), ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న భరత్ అలియాస్ లడ్డు (16) శవాలు లభించాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. ఈత కొట్టేందుకు ఉదయమే మున్నా, అస్మద్, భరత్ అలియాస్ లడ్డు, గంగాధర్, గౌతమ్, బన్నీ అలియాస్ నవీన్, అప్రోజ్, ప్రణీత్, అమర్ కలిసి ఈదుల చెరువు వద్దకు వెళ్లి నీళ్లు ఎక్కువగా ఉండడంతో భయపడి తిరిగొచ్చినట్లు సమాచారం. తర్వాత మధ్యాహ్నం 3 గంట ల ప్రాంతంలో రెండు బైకులపై తిరిగి చెరువు వద్దకు వె ళ్లారు. చెరువులోకి ముందుగా మున్నా, అస్మద్, భరత్, గంగాధర్ దిగారు. మిగతా వారు గట్టుపై ఉన్నారు. నీటి లో నడుస్తున్న క్రమంలో చెరువులో ఉన్న గుంతలోకి మునిగిపోయారు. అప్రమత్తమైన మిగితా వారు అక్కడే పైపును అందించి రక్షించేందుకు ప్రయత్నించగా గంగాధర్ బయటపడ్డాడు. మిగితా వారు గల్లంతయ్యారు. త ర్వాత భయంతో ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. సాయంత్రం తల్లిదండ్రులకు చెప్పడంతో సమాచారం అందుకున్న వనపర్తి సీఐ ప్రవీణ్‌కుమార్, పట్టణ ఎస్సై యుగంధర్‌రెడ్డి చెరువు వద్దకు వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాలను ప్రభుత్వ దవాఖానకు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న మంత్రి నిరంజన్‌రెడ్డి దవాఖాన వద్దకు వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
మున్నా తండ్రి అక్బర్ వనపర్తిలో ఫుట్‌పాత్‌పై బట్టల వ్యాపారం చేస్తుంటాడు. ఇటీవలే ప్రమాదంలో కాలు విరిగి నడువలేని స్థితిలో ఉన్నాడు. తండ్రికి చేదోడు వా దోడుగా ఉంటూ కుటుంబ పోషణకు సహకారం అందిస్తున్నాడు. అద్దె ఇంట్లో నివసిస్తున్న వీరు మున్నాను కో ల్పోయారు. గద్వాల జిల్లా అయిజ నుంచి 15 ఏండ్ల కిందట ఇక్కడికి వలస వచ్చారు. ఉన్న ఒక్క కుమారు డు మృతితో ఆ కుటుంబం దుఃఖ సాగరంలో మునిగిపోయింది. భరత్ అలియాస్ లడ్డు కుటుంబానిదీ అదే పరిస్థితి. తండ్రి యాదగిరి ఆటో నడుపుతాడు. భరత్‌తోపాటు సోదరి ఉన్నది. అస్మద్ స్థానిక నాయకుడు క రీం కొడుకు. వీరి కుటుంబాలు అన్నీ ఆర్థికంగా అంతం త మాత్రమే. కానీ అకాల మృత్యువు వారి కుటుంబా ల్లో విషాదాన్ని నింపింది.