Pradeep Ranganathan | ఇటీవల కాలంలో సినీ కార్యక్రమాల్లో, ముఖ్యంగా ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూల్లో తెలుగు ఫిల్మ్ జర్నలిస్టుల ప్రశ్నల తీరు చర్చనీయాంశంగా మారుతున్న విషయం తెలిసిందే. తమ సినిమా ప్రమోషన్లకు వచ్చిన నటీనటులను, సాంకేతిక నిపుణులను ఇబ్బంది పెట్టే.. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన, లేదా వృత్తికి సంబంధం లేని ప్రశ్నలు అడగడం మితిమీరిపోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే సాయిరాజ్(మూర్తి) అనే పాత్రికేయుడు ఒక మంచు లక్ష్మీతో ఇంటర్వ్వూలో భాగంగా ఆమె వస్త్రధారణపై కామెంట్ చేశాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన మంచు లక్ష్మీ సాయిరాజ్‌ను అక్కడిక్కడే నిలదీయడంతో పాటు అతడిపై ఫిల్మ్ ఛాంబర్లో కంప్లయింట్ చేసింది. అయితే ఈ ఘటన మరువకముందే ఒక లేడి జర్నలిస్ట్ చేసిన పని వలన తెలుగు సినీ పరిశ్రమ పరువు తీసేలా చేసింది.
వివరాల్లోకి వెళితే.. తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ నటించిన తాజా చిత్రం డ్యూడ్. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా తెలుగు ప్రమోషన్స్‌లో పాల్గోంది చిత్రయూనిట్. అయితే ఈ ప్రెస్ మీట్లో ఒక మహిళ జర్నలిస్ట్ ప్రదీప్ రంగనాథన్ని ఉద్దేశించి అడుగుతూ.. మీరు హీరో మెటీరియాలా ? మీరు హీరోలా కనిపించరు.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రశ్నకు ప్రదీప్ బదులిస్తుండగా పక్కనే ఉన్న నటుడు శరత్ కుమార్ మైక్ తీసుకుని సదరు జర్నలిస్ట్‌కి స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చాడు. మీరు ఎవరిని హీరో అని జడ్జ్ చేయకుడదు. ఇక్కడ ఉన్నవారందరూ వారికి వారు హీరోలే. సమాజంకి మంచి చేసే వ్యక్తి ఎవరైన కూడా హీరోనే అంటూ శరత్ చెప్పుకోచ్చాడు. దీంతో ఈ వీడియో చాలా వైరల్‌గా మారింది. ముఖ్యంగా ఈ విషయంలో ప్రదీప్‌కి చాలామంది నెటిజన్లు మద్దతును తెలుపుతూ లేడి జర్నలిస్ట్‌ను తప్పుబడుతున్నారు. మరోవైపు ఆ లేడి జర్నలిస్ట్‌పై చర్యలు తీసుకోవాలంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఎలాంటి చర్యలు తీసుకున్న మారాల్సింది ఫిల్మ్ జర్నలిస్ట్‌ల ఆలోచన విధానం.
What is this question??? Well said @realsarathkumar , @pradeeponelife more power to u💪💪 pic.twitter.com/2PIQYrfdEi
— Radikaa Sarathkumar (@realradikaa) October 11, 2025
This particular female journalist needs to be banned from press meets. Not once or twice – she keeps asking ridiculous questions every now and then.
What even was that question?!
She directly said he’s not hero material#Dude #PradeepRanganathan pic.twitter.com/xpsnubgngA
— Vedi..VediGa… (@vedivediga) October 9, 2025