Wife Murder | ప్రియురాలితో పెళ్లికి నో చెప్పిందని.. రెండో భార్యకు నిప్పంటించిన భర్త
Wife Murder | ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. ప్రియురాలితో పెళ్లికి నో చెప్పిందని.. తన రెండో భార్యకు భర్త నిప్పంటించాడు.
Wife Murder | పాట్నా : ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. ప్రియురాలితో పెళ్లికి నో చెప్పిందని.. తన రెండో భార్యకు భర్త నిప్పంటించాడు. ఈ దారుణ ఘటన బీహార్‌లోని నలంద జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. నలంద జిల్లాకు చెందిన వికాస్ కుమార్ ఐదేండ్ల క్రితం సునీత దేవి(25)ని వివాహం చేసుకున్నాడు. అతనికి అప్పటికే పెళ్లి అయినట్లు సునీతను వివాహమాడిన తర్వాత ఆమె తల్లిదండ్రులకు తెలిసింది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే సునీతను పెళ్లాడినట్లు తెలిసింది. దీంతో సునీత తల్లిదండ్రులు వికాస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి అతని కుటుంబ సభ్యులు నచ్చజెప్పడంతో సునీత తల్లిదండ్రులు శాంతించారు.
కొన్నాళ్లకు సునీత, వికాస్ దంపతులకు ఇద్దరు పిల్లలు జన్మించారు. కానీ పుట్టిన వెంటనే ఆ పిల్లలిద్దరూ చనిపోయారు. ఇక అప్పట్నుంచి కుమార్ సునీతను వేధింపులకు గురి చేస్తున్నాడు. తాను తన ప్రియురాలిని పెళ్లి చేసుకుంటానని, అంగీకరించాలని భార్యను వేధిస్తున్నాడు. ఇందుకు సునీత ఒప్పుకోలేదు.
ఈ క్రమంలో ఆమెపై పగ పెంచుకున్న భర్త చంపాలని నిర్ణయించుకున్నాడు. శనివారం నాడు ఆమెను ఓ గదిలో బంధించి పెట్రోల్ పోశాడు. ఆ తర్వాత సిలిండర్‌ను లీక్ చేసి నిప్పంటించాడు. పెట్రోల్ పోసి గదిని మూసిన వెంటనే సునీత తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. వికాస్ దారుణాలను వివరించి, తనకు నిప్పంటిస్తున్నట్లు తెలిపింది. అప్రమత్తమైన తల్లిదండ్రులు వికాస్ ఇంటికి చేరుకునేలోగా ఆమె ప్రాణాలు కోల్పోయింది. దహన సంస్కారాలు కూడా చేసే పనిలో వికాస్ కుటుంబ సభ్యులు నిమగ్నమయ్యారు. అయితే సునీత కుటుంబ సభ్యులను చూసి వికాస్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు పరారీ అయ్యారు.
మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్ బృందాలు నమూనాలను సేకరించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ayushmann Khurrana | ఆయుష్మాన్ ఖురానాకు బెదిరింపు కాల్స్.. కోట్లు డిమాండ్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.?
బ్యాంక్ తరలించొద్దని గ్రామస్తుల ధర్నా
జయశంకర్ భూపాలపల్లి జిల్లా డాన్సర్స్ యూనియన్ నూతన కమిటీ ఎంపిక
SKN | రాధికా ఆప్టే వ్యాఖ్యలపై ఎస్కేఎన్ ఫైర్.. పాత వీడియోతో నిర్మాతకు నెటిజన్ల కౌంటర్!
Suicides | అనంతపురం జిల్లాలో విషాదం.. రైలు కిందపడి తల్లి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

