విజయ్, శీతల్భట్ జంటగా ఏ.ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న తాజా చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సురేష్‌ప్రభు దర్శకుడు. ఏ.ఆర్.రాకేష్ నిర్మిస్తున్నారు. నాయకానాయికలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు గోపీచంద్‌మలినేని క్లాప్‌నివ్వగా, బెక్కెం వేణుగోపాల్ కెమెరా స్విఛాన్ చేశారు. శ్రీకాంత్ అడ్డాల గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది. ఊహకందని మలుపులతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఆదివారం నుంచి హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించాం’ అని తెలిపారు. స్క్రీన్‌ప్లే ప్రధానంగా నవ్యమైన కథ, కథనాలతో ఈ సినిమాను రూపొందిస్తున్నామని నిర్మాత అన్నారు. శ్రీనివాస్‌రెడ్డి, చిత్రంశ్రీను, రవివర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మహావీర.