Free Bus | ఆర్టీసీ బస్సు ఎక్కుతున్న మహిళతో డ్రైవర్ అసభ్యంగా మాట్లాడిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. బత్తలపల్లిలో బస్సు ఎక్కేందుకు ప్రయత్నించిన సమయంలో డ్రైవర్ తనను అసభ్య పదజాలంతో దూషించాడని ఆరోపిస్తూ ఓ మహిళ సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగింది.
బత్తలపల్లిలో ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా డ్రైవర్ తనతో దురుసుగా ప్రవర్తించడంతోపాటు అసభ్య పదజాలంతో మాట్లాడాడని మహిళ తెలిపింది. ‘‘ఫ్రీ బస్సే కదా.. గు.. మూసుకొని బస్సు ఎక్కు’’ అంటూ తనను అవమానించేలా మాట్లాడాడని ఆమె ఆరోపించింది. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టింది.
ఫ్రీ బస్సే కదా గు.. మూసుకొని బస్సు ఎక్కు..!
అనంతపురం జిల్లాలో మహిళతో అసభ్యంగా మాట్లాడిన ఆర్టీసీ డ్రైవర్
బత్తలపల్లిలో ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా డ్రైవర్ అసభ్య పదజాలంతో దూషించాడంటూ కలెక్టర్ ఆఫీస్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన మహిళ
ఆర్టీసీ డ్రైవర్ పై దాడికి యత్నించిన… pic.twitter.com/ODUuuPu1KT
— Telugu Scribe (@TeluguScribe) September 29, 2026
మహిళకు జరిగిన అవమానంపై ఆగ్రహించిన ఆమె బంధువులు ఆర్టీసీ డ్రైవర్‌పై దాడికి యత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మహిళ ఫిర్యాదుపై ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. మహిళతో అసభ్యంగా మాట్లాడిన ఆర్టీసీ డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని బాధితురాలు, ఆమె బంధువులు డిమాండ్ చేశారు.