హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రస్తుతం భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నా యి. పగలంతా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు న మోదవుతూ ఉకపోత, వడగాల్పులతో ప్ర జలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సాయంత్రం ఆకాశం మేఘాలు కమ్ముకొని ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తున్నది. హైదరాబాద్ వాతావరణ కేం ద్రం ప్రకటన విడుదల చేసింది.
సోమవారం ఎండలు మండిపోయి దాదాపు 30 జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టు తెలిపింది. జగిత్యాల జిల్లా ఆరుట్లలో అత్యధికంగా 41.9 డిగ్రీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం, మంచిర్యాల జిల్లా కాసీపేట, నల్లగొండ జిల్లా పెద్దవూర, నిజామాబాద్ జిల్లా భీంగల్లో 41.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని పేర్కొన్నది. వచ్చే 4 రోజులు ఉష్ణోగ్రతలు ఇలానే ఉంటాయని వివరించింది.