‘సాగర్ గర్భంలో ఏపీ అక్రమ సొరంగం’
– శ్రీశైలం నీళ్లను దోచుకుపోయారు..ఇప్పుడు సాగర్ నీళ్లు
– ఎనిమిది నెలలుగా కొనసాగుతున్న పనులు
– మంత్రులు ఏం చేస్తున్నరు.. మొద్దునిద్రలో ప్రభుత్వం
– కృష్ణా జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి జగదీశ్ రెడ్డి ప్రశ్నల వర్షం
నల్లగొండ నవంబర్ 21 : నాగార్జునసాగర్ గర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమ సొరంగం చేపట్టి ఎనిమిది నెలలుగా పనులను కొనసాగిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం నిద్రపోతోందా?, మంత్రులు ఏం చేస్తున్నరని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. శ్రీశైలం నీళ్లను దోచుకుపోయారు..ఇప్పుడు సాగర్ నీళ్లపైనా కన్నేసినట్లు తెలిపారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్న లెక్కలన్నీ అవాస్తవాలే అన్నారు. ఏపీ 250 టీఎంసీలకు పైగా వాడుకుంటే తెలంగాణకు 40 టీఎంసీలు కూడా దక్కలేదన్నారు. కాగా 128 టీఎంసీలు తెలంగాణ వాడిందంటున్నారు. ఏ ప్రాజెక్టు నుండి ఎన్ని నీళ్లు తీసుకున్నారో లెక్కలు బయటపెట్టాలన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాసిన లేఖలు ఎక్కడ? డీవో నంబర్లతో సహా ప్రజల ముందు ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ సొరంగం నిర్మాణానికి తెలంగాణ అనుమతి ఇచ్చిందా? కేఆర్ఎంబీ అనుమతులు ఉన్నాయా? కేంద్రం ఏం చెబుతోందన్నారు.
తెలంగాణ కంటే ఆంధ్రా ప్రయోజనాలే ముఖ్యమా?
ఆంధ్రప్రదేశ్‌కు ఒక్క చుక్క నీరు కూడా తీసుకెళ్లనివ్వొద్దని, తెలంగాణ వాటా నీటిని కాపాడాల్సిందేనన్నారు. నల్లగొండ జిల్లా రైతుల కళ్లముందే కృష్ణమ్మ నీళ్లు కిందికి పోతుంటే మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సాగర్ ఎడమ కాల్వ ఎండిపోయింది. కుడి కాల్వ కింద ఏపీ పంటలు పండించుకుంటోంది. సాగర్ నీళ్లతో తెలంగాణ చెరువులు నింపే సోయి కూడా ప్రభుత్వానికి లేదా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ మంత్రుల ఆత్మలు చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రయోజనాల కంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే ముఖ్యమయ్యాయా అని ప్రశ్నించారు. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు కృష్ణా జలాల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. కేసీఆర్ హయాంలో చివరి ఎకరం వరకు నీళ్లిచ్చాం. ఇప్పుడు కాలువల్లో నీళ్లు లేక రైతులు ఎదురు చూస్తున్నారు. డీ-25, డీ-37, డీ-38, డీ-40 కాల్వల ఆయకట్టుకు నీళ్లు ఎక్కడ అని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణలో మళ్లీ వలసలు తీసుకొచ్చిన ప్రభుత్వం
ఆరుతడి పంటలు వేయమంటున్నారు. నీళ్లు ఇవ్వకుండా పంటలు ఎలా పండించాలి? కూరగాయలు పండించాలన్నా నీళ్లు కావాలి. రైతులకు ఏం సమాధానం చెబుతారన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు నెలల తరబడి పడిగాపులు పడుతుండగా ప్రైవేటు వ్యాపారులకు రైతులను అప్పగిస్తున్నారని మండిపడ్డారు. మిల్లర్లతో కుమ్మక్కై రైతులను దళారుల చేతుల్లో పెడుతున్నారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తెలంగాణలో మళ్లీ వలసల పరిస్థితి తీసుకొచ్చినట్లు తెలిపారు. రైతాంగాన్ని సంక్షోభంలోకి నెట్టారు. ఎనిమిదేళ్లుగా చివరి ఆయకట్టు వరకు నీళ్లిచ్చాం. కాంగ్రెస్ పాలనలో ఒక్కసారి కూడా ఉదయసముద్రం అలుగు దుంకలేదన్నారు.
సాగర్ నీటి సంరక్షణకు తక్షణ చర్యలు చేపట్టాలి
నాగార్జునసాగర్‌లో మిగిలిన నీటిని కాపాడడానికి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీ సొరంగం నిర్మాణాన్ని ఆపేందుకు ప్రభుత్వం ఏం చేసింది? ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ హక్కులను కాపాడకపోతే రైతాంగానికి తీవ్ర నష్టం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, బండ్ల నరేందర్ రెడ్డి, మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, బోనగిరి దేవేందర్, రావుల నాగరాజు, దొడ్డి రమేష్ పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సాగర్ గర్భంలో ఏపీ అక్రమ సొరంగం’
Fishermen’s Protest | మంత్రులు జూపల్లి, వాకిటి శ్రీహరికి మత్స్యకారుల నిరసన సెగ
Karoline Leavitt | ‘పెళ్లిళ్లు చేసుకుని ఎక్కువ మంది పిల్లలను కనండి’.. అమెరికా యువతకు కరోలిన్ లీవిట్ పిలుపు..!
Manne Krishank | ఇలా దాడులు చేస్తే పెట్టుబడులు ఎలా వస్తాయి.. మెటా క్యాంపస్ ఘటనపై మన్నె క్రిశాంక్
Phule Movie | తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఫూలే’.. నవంబర్ 27న గ్రాండ్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video

