హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని గుంటూరు వ్యవసాయ పాలిటెక్నిక్, గుర్తింపు పొందిన ప్రైవేట్ వ్యవసాయ పాలిటెక్నిక్ల్లో నిర్వహించే రెండు, మూడ్లేండ్ల వ్యవసాయ, సేంద్రియ వ్యవసాయ, విత్తన సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల ప్రవేశానికి కనీస ప్రవేశ వయస్సు నిబంధనల్లో మార్పులు చేసినట్టు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రకటించింది. గతంలో 15 ఏండ్లు పూర్తి కావాలనే నిబంధన ఉండగా దాన్ని మార్చినట్టు పేర్కొన్నది. 2026-27 నుంచి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత పొందినవారు ఈ కోర్సుల్లో ప్రవేశానికి అర్హులుగా నిర్ణయించినట్టు తెలిపారు.