AP Singh | భారత బలగాలకు అందని లక్ష్యమంటూ ఏదీలేదు.. ఎయిర్‌చీఫ్ మార్షల్ ఏపీ సింగ్..!
AP Singh | భారత బలగాలకు అందని లక్ష్యమంటూ ఏదీ లేదని ఎయిర్ చీఫ్ మార్షల్ (Air Chief Marshal) ఏపీ సింగ్ అన్నారు. గత ఏడాది పాక్‌లోని ఉగ్రస్థావరాలపై ‘ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor)’ పేరుతో భారత్ చేపట్టిన కచ్చితమైన దాడులు ఈ విషయాన్ని నిరూపించాయన్నారు. ఆ సమయంలో వాయుసేన వ్యూహాత్మకంగా ముందడుగు వేసి, ఉగ్రవాదులను కోలుకోలేని దెబ్బ కొట్టిందని చెప్పారు.
AP Singh : భారత బలగాలకు అందని లక్ష్యమంటూ ఏదీ లేదని ఎయిర్ చీఫ్ మార్షల్ (Air Chief Marshal) ఏపీ సింగ్ అన్నారు. గత ఏడాది పాక్‌లోని ఉగ్రస్థావరాలపై ‘ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor)’ పేరుతో భారత్ చేపట్టిన కచ్చితమైన దాడులు ఈ విషయాన్ని నిరూపించాయన్నారు. ఆ సమయంలో వాయుసేన వ్యూహాత్మకంగా ముందడుగు వేసి, ఉగ్రవాదులను కోలుకోలేని దెబ్బ కొట్టిందని చెప్పారు. ప్రస్తుతం సైన్యం వద్ద ఉన్న అణ్వాయుధాలు, కచ్చితత్వంతో ఛేదించగల అధునాతన క్షిపణి వ్యవస్థలు శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయన్నారు.
ఆ ఆపరేషన్‌తో స్వదేశీ ఆయుధాల శక్తిని ప్రపంచ దేశాలు చూశాయని పునరుద్ఘాటించారు. స్వదేశీ ఉత్పత్తుల తయారీ.. రక్షణ రంగం ఆధునికీకరణకే కాకుండా దేశ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తికి సైతం బాటలు వేస్తోందన్నారు. కాగా, అక్టోబర్ 31న పదవీ విరమణ చేయనున్న ఏపీ సింగ్.. పీటీఐతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ దేశాల్లో అస్థిరత కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశ భద్రతను సుస్థిరం చేసేందుకు ఇండో పసిఫిక్ ప్రాంతంలో మన శక్తి సామర్థ్యాల ప్రదర్శన ఎంతో ముఖ్యమని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు.
జాతీయ ప్రయోజనాలను పరిరక్షించేందుకు, ఇండో-పసిఫిక్‌లో నెలకొన్న పరిస్థితిని వైమానికదళం నిశితంగా పర్యవేక్షిస్తోందని, దేశ భద్రతను కాపాడటానికి ఐఏఎఫ్ ఎప్పుడూ సిద్ధంగా ఉందని ఏపీ సింగ్ అన్నారు. మరింత సంక్లిష్టమైన విన్యాసాలు, కార్యాచరణల ద్వారా మిత్రదేశాల వైమానిక దళాలతో పరస్పర సహకారాన్ని బలోపేతం చేస్తున్నామని చెప్పారు. ఇండో-పసిఫిక్‌లో శాంతి, స్థిరత్వాన్ని కొనసాగించడానికి అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లతో కూడిన క్వాడ్ సభ్య దేశాలతో కలిసి భారత్ పనిచేస్తున్నదని తెలిపారు.
ఆస్ట్రేలియా, మలేషియా, థాయ్‌లాండ్‌లకు ఇటీవల ఐఏఎఫ్ పంపిన దళాలు సుదూర కార్యకలాపాలు, సముద్ర వైమానిక కార్యకలాపాలలో విలువైన అనుభవాన్ని అందించాయని ఏపీ సింగ్ పేర్కొన్నారు. భారత్, అమెరికా సహా ఇతర దేశాలు స్వేచ్ఛాయుత, శాంతియుత ఇండో-పసిఫిక్ కోసం ఒత్తిడి చేస్తున్నప్పటికీ.. వనరులు సమృద్ధిగా ఉన్న ఈ ప్రాంతంలో చైనా తన సైనిక బలాన్ని పెంచుకోవడంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్‌చీఫ్ మార్షల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Singh | భారత బలగాలకు అందని లక్ష్యమంటూ ఏదీలేదు.. ఎయిర్‌చీఫ్ మార్షల్ ఏపీ సింగ్..!
Breast Cancer | రొమ్ము క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించి చికిత్స చేయించుకున్న మహిళ.. ప్రాణాలను కాపాడుకోవడంలో కీలకం..
Man Prints Fake Rs 500 Notes | ఇంటి అద్దె చెల్లించలేక.. నకిలీ రూ.500 నోట్లు ముద్రించిన వ్యక్తి
France Protests | ఫ్రాన్స్‌లో చెలరేగిన హింస.. 1000 మంది అరెస్ట్.. టియర్ గ్యాస్, వాటర్ కెనాన్ల ప్రయోగం
AP News | రానున్న ఐదు రోజులు అప్రమత్తంగా ఉండండి.. అధికారులకు ఏపీ హోంమంత్రి ఆదేశం..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

