AP News | రానున్న ఐదు రోజులు అప్రమత్తంగా ఉండండి.. అధికారులకు ఏపీ హోంమంత్రి ఆదేశం..!
AP News | ఏపీలో అర్నబ్ తుపాను బీభత్సం సృష్టించే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఏపీ హోంమంత్రి అనిత సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. రానున్న ఐదు రోజులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
AP News : ఏపీలో అర్నబ్ తుపాను బీభత్సం సృష్టించే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఏపీ హోంమంత్రి అనిత సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. రానున్న ఐదు రోజులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. సోమవారం నుంచి విస్తారంగా, మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. బుధవారం బాపట్ల-విశాఖ తీరాల మధ్య తుపాను తీరం దాటే సూచనలు ఉన్నాయని, ఆ సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని మంత్రి చెప్పారు.
తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదకరంగా ఉన్న హోర్డింగులను వెంటనే తొలగించాలని హోంమంత్రి ఆదేశించారు. అవసరమైతే తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, బీచ్లలోకి పర్యాటకులను అనుమతించవద్దని అన్నారు. భారీ అలలు ఎగసిపడే ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకోవడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
రైతులు, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, వ్యాప్తి చేయవద్దని సూచించారు. విపత్తుల నిర్వహణ సంస్థ, ఆర్టీజీఎస్ జారీచేసే అధికారిక హెచ్చరికలను పాటించాలని మంత్రి అనిత కోరారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | రానున్న ఐదు రోజులు అప్రమత్తంగా ఉండండి.. అధికారులకు ఏపీ హోంమంత్రి ఆదేశం..!
CULT Title | సూర్య సినిమా కోసం ‘కల్ట్’ టైటిల్ అడిగారు.. కానీ నేను ఇవ్వలేదు: విశ్వక్ సేన్
Rahul Gandhi | ‘మా ర్యాలీకి పబ్లిసిటీ చేస్తున్నందుకు థ్యాంక్స్’.. బీజేపీపై రాహుల్‌గాంధీ వ్యంగ్యాస్త్రాలు..!
Weekly Bus Pass | హైదరాబాద్ ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్.. ఇక ‘వీక్లీ బస్ పాస్’తో అపరిమిత బస్ ప్రయాణం
Errabelli Dayakar Rao | ఎన్నికల్లో ఓటరు నమోదే కీలకం : ఎర్రబెల్లి దయాకర్ రావు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

