Man Prints Fake Rs 500 Notes | ఇంటి అద్దె చెల్లించలేక.. నకిలీ రూ.500 నోట్లు ముద్రించిన వ్యక్తి
Man Prints Fake Rs 500 Notes | అద్దె ఇంట్లో నివసిస్తున్న వ్యక్తి కిరాయి చెల్లించలేక ఇబ్బంది పడ్డాడు. ఈ నేపథ్యంలో ఆ ఇంట్లో రహస్యంగా నకిలీ రూ.500 నోట్లను అతడు ముద్రించాడు. ఇంటి యజమానితో గొడవ పడిన ఆ వ్యక్తి పారిపోయాడు.
ముంబై: అద్దె ఇంట్లో నివసిస్తున్న వ్యక్తి కిరాయి చెల్లించలేక ఇబ్బంది పడ్డాడు. ఈ నేపథ్యంలో ఆ ఇంట్లో రహస్యంగా నకిలీ రూ.500 నోట్లను అతడు ముద్రించాడు. ఇంటి యజమానితో గొడవ పడిన ఆ వ్యక్తి పారిపోయాడు. ఆ ఇంటి తాళం పగులగొట్టి లోపలకు వెళ్లి చూసిన యజయాని నకిలీ రూ.500 నోట్లు ప్రింట్ చేసి ఉండటం చూసి షాక్ అయ్యాడు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. నాగ్‌పూర్‌లోని త్రిమూర్తి నగర్‌కు చెందిన పుష్పక్ కృష్ణ భండార్కర్ అలియాస్ బెండానె, ఏడాదిన్నర కిందట ఖర్బీ ప్రాంతంలో ఒక గదిని అద్దెకు తీసుకున్నాడు. అద్దె ఒప్పందం జనవరిలో ముగిసింది. అలాగే గత కొన్ని నెలలుగా ఇంటి యజమానికి అద్దె చెల్లించడం కూడా అతడు ఆపేశాడు.
కాగా, ఇంటిని ఖాళీ చేయాలని యజమాని రమేష్ డిమాండ్ చేయగా పుష్పక్ కత్తితో బెదిరించాడు. దీంతో ఇంటి యజమాని పోలీసులను ఆశ్రయించంతో అతడిపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత చాలా కాలంగా పుష్పక్ అద్దె ఇంటికి రాలేదు. ఈ నేపథ్యంలో యజమాని రమేష్ అక్టోబర్ 24న సుత్తితో డోర్ తాళం పగులగొట్టాడు. ఇంటి లోపలకు వెళ్లి చూడగా బకెట్లో కరెన్సీ నోట్ల కట్టలు, అక్కడక్కడ పడిఉన్న కాగితపు షీట్లు, ఒక ప్రింటర్ ఉండటం చూసి ఆయన షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
మరోవైపు పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ ఇంట్లో నకిలీ రూ.500 నోట్లు ప్రింటింగ్ చేస్తున్నట్లు గ్రహించారు. కౌంటింగ్ యంత్రాన్ని తెప్పించి లెక్కించారు. రూ.37 లక్షల విలువైన నకిలీ నోట్లను పుష్పక్ ముద్రించినట్లు గుర్తించారు. ఒకవైపు పాక్షికంగా ముద్రించిన కరెన్సీ నోట్లు, ప్రింటింగ్ సామగ్రి సహా రూ.48 లక్షల విలువైన వాటిని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న పుష్పక్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. అతడు ముంబైలో ఉన్నట్లు తెలుసుకుని అరెస్ట్ కోసం ప్రయత్నిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Singh | భారత బలగాలకు అందని లక్ష్యమంటూ ఏదీలేదు.. ఎయిర్‌చీఫ్ మార్షల్ ఏపీ సింగ్..!
Breast Cancer | రొమ్ము క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించి చికిత్స చేయించుకున్న మహిళ.. ప్రాణాలను కాపాడుకోవడంలో కీలకం..
Man Prints Fake Rs 500 Notes | ఇంటి అద్దె చెల్లించలేక.. నకిలీ రూ.500 నోట్లు ముద్రించిన వ్యక్తి
France Protests | ఫ్రాన్స్‌లో చెలరేగిన హింస.. 1000 మంది అరెస్ట్.. టియర్ గ్యాస్, వాటర్ కెనాన్ల ప్రయోగం
AP News | రానున్న ఐదు రోజులు అప్రమత్తంగా ఉండండి.. అధికారులకు ఏపీ హోంమంత్రి ఆదేశం..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

