France Protests | ఫ్రాన్స్‌లో చెలరేగిన హింస.. 1000 మంది అరెస్ట్.. టియర్ గ్యాస్, వాటర్ కెనాన్ల ప్రయోగం
France Protests : ఫ్రాన్స్‌లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. మొదట ఫ్రాన్స్ వరకే పరిమితమైన ఆందోళనలు ఇప్పుడు అనేక పట్టణాలకు విస్తరించాయి.
France Protests : ఫ్రాన్స్‌లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. మొదట ఫ్రాన్స్ వరకే పరిమితమైన ఆందోళనలు ఇప్పుడు అనేక పట్టణాలకు విస్తరించాయి. ప్రజలు, యువత పెద్ద ఎత్తున నిరసనలు తెలపడంతో ఆందోళన ఉధృతంగా కొనసాగుతోంది. జీవన వ్యయం పెరగడం, నిత్యవసరాల సరుకులు అందుబాటులో లేకపోవడం, నిరుద్యోగం వంటి సమస్యల్ని నిరసిస్తూ ఫ్రాన్స్‌లో ప్రజలు ఆందోళనబాట పట్టారు.
ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఈ ఆందోళన హింసాత్మకంగా మారడంతో పోలీసులు 1,000 మందిని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఫ్రాన్స్ రక్షణ శాఖ మంత్రి లారెంట్ నునెజ్ వెల్లడించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా 4,10,000 మంది ఆందోళనల్లో పాల్గొన్నారు. అయితే, నిర్వాహకులు మాత్రం 8,00,000 మంది ఆందోళనల్లో పాల్గొన్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న ఈ ఆందోళనల్లో కొందరు నిరసనకారులు షాపులు దహనం చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు.
షాపుల్ని లూటీ చేస్తున్నారు. దీంతో తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. కోర్స్ డి విన్సెన్నెస్ ప్రాంతంలో ఆందోళనకారుల్ని చెదరగొట్టారు. ఈ ప్రాంతంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు హెలికాప్టర్లను కూడా వాడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఆందోళనల్ని అదుపు చేయడానికి వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్, గ్రెనడ్లు వంటివి వాడుతున్నట్లు వివరించారు. శాంతి భద్రతల స్థాపనకు కృషి చేస్తున్నామన్నారు. లియోన్, లిల్లె, మార్సెల్లి సహా ఇతర పట్టణాల్లోనూ ఆందోళనలు జరిగాయి.
`
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | ఫ్రాన్స్‌లో చెలరేగిన హింస.. 1000 మంది అరెస్ట్.. టియర్ గ్యాస్, వాటర్ కెనాన్ల ప్రయోగం
AP News | రానున్న ఐదు రోజులు అప్రమత్తంగా ఉండండి.. అధికారులకు ఏపీ హోంమంత్రి ఆదేశం..!
CULT Title | సూర్య సినిమా కోసం ‘కల్ట్’ టైటిల్ అడిగారు.. కానీ నేను ఇవ్వలేదు: విశ్వక్ సేన్
Rahul Gandhi | ‘మా ర్యాలీకి పబ్లిసిటీ చేస్తున్నందుకు థ్యాంక్స్’.. బీజేపీపై రాహుల్‌గాంధీ వ్యంగ్యాస్త్రాలు..!
Weekly Bus Pass | హైదరాబాద్ ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్.. ఇక ‘వీక్లీ బస్ పాస్’తో అపరిమిత బస్ ప్రయాణం
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

