AP Rains | బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి.. ఏపీలో నాలుగురోజులు వర్షాలు..!
AP Rains | బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రాష్ట్రంలో వాతావరణం మేఘావృతమై ఉండటంతోపాటు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు.
AP Rains : బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రాష్ట్రంలో వాతావరణం మేఘావృతమై ఉండటంతోపాటు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. బుధవారం 14 జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో వానలు కురిసే ఛాన్స్ ఉందని ప్రఖర్ జైన్ చెప్పారు. శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పారు. మెరుపులు, ఈదురుగాలులతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద నిలబడవద్దని హెచ్చరించారు.
ఇవాళ (మంగళవారం) సాయంత్రం మూడు గంటల వరకు నెల్లూరు జిల్లా కొండాపురంలో అత్యధికంగా 39.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో 34.4 మిల్లీమీటర్లు, కావలిలో 34.2 మిల్లీమీటర్లు, మారెళ్లలో 33.5 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్టు అయిందని వెల్లడించారు. త్రిపురాంతకంలో 27.9 మిల్లీమీటర్లు, నెల్లూరులో 27.5 మిల్లీమీటర్లు, ములుకుదురులో 26 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు ప్రఖర్ జైన్ తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Rains | బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి.. ఏపీలో నాలుగురోజులు వర్షాలు..!
Sampath Nandi | పవన్ కల్యాణ్‌తో సినిమా చేయని సంపత్ నంది.. కారణం ఏంటో తెలుసా..?
Karthika Pournami | వేయిస్తంభాల దేవాలయంలో కార్తీక పౌర్ణమి శోభ.. దర్శనానికి బారులు తీరిన భక్తులు
Vidadala Rajini | ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం : వైసీపీ మాజీ మంత్రి రజిని
Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 28 బంతుల్లో సెంచరీ.. 52 బంతుల్లో డబుల్ సెంచరీ..!
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

