Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Assam Girl | ప్రాథమిక విచారణ అనంతరం అసోం యువతి హిమ శ్రీ బోరాపై ఎలాంటి శారీరక హింస, లైంగిక దాడి కానీ జరుగలేదు. ఇంకా ఫైనల్ రిపోర్ట్ రావాల్సి ఉందని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
Assam Girl | డ్యాన్స్ పోటీల్లో పాల్గొనేందుకు విశాఖపట్నానికి వచ్చిన అసోం యువతి హిమశ్రీ బోరా రైల్వే ట్రాక్ పక్కన అనుమానాస్పదంగా మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా..శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో రైలు పట్టాల వద్ద హిమశ్రీ మృతదేహం లభించినచోట పోలీసులు మరో గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించారు.
ఈ నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. హిమ శ్రీ బోరా ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి కొన్ని ప్రోగ్రామ్స్ చేసుకునేందుకు ఇక్కడికొచ్చారు. హిమ శ్రీ బోరా ఒక పరీక్ష రాయాలని తిరిగి అసోం వెళ్లాలని అక్టోబర్ 5న రాత్రి రైలు టికెట్‌ను రిజర్వేషన్ చేసేందుకు ప్రయత్నించారు. ఆ రైలులో రిజర్వేషన్ అవ్వలేదు. రైలు సమయానికి రాకపోవడంతో వాళ్లు నెక్ట్స్ వచ్చే వివేక్ ఎక్స్‌ప్రెస్‌లో జనరల్ టికెట్ తీసుకొని స్లీపర్ కోచ్‌లో ఎక్కారు. ఆ స్లీపర్ కోచ్ కూడా చివరి నిమిషంలో అంటే రైలు స్టార్ట్ అయిపోయింది.. ఆ తర్వాత చివరి నిమిషంలో వాళ్లు ఎక్కారు. అప్పటికే లోపల రిజర్వేషన్ అయిన వాళ్లు, రిజర్వేషన్ కాని ప్రయాణికులు కొంతమంది బోగీలో ఉన్నారు. రద్దీ ఉండటం వల్ల లోపలికి వెళ్లలేకపోయారు. లోపలికి వెళ్లలేక డోర్ దగ్గరే నిల్చొని ఉండాల్సి వచ్చింది.
ప్రాథమిక విచారణ అనంతరం హిమ శ్రీ బోరాపై ఎలాంటి శారీరక హింస, లైంగిక దాడి కానీ జరుగలేదు. ఇంకా ఫైనల్ రిపోర్ట్ రావాల్సి ఉంది. అదే కాకుండా ప్రమాదమా.. లేదా వేరే కోణాల్లో ఏమైనా జరిగిందా అనేది కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చాక పూర్తి స్పష్టత వస్తుంది. రైల్వే పోలీసుల హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఏ బోగీలో ఉందో చెప్పలేదని, శ్రీకాకుళం రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులు వెతికినా యువతి ఆచూకీ లభించలేదన్నారు. రైలు నుంచి ప్రమాదవశాత్తు పడిపోయిందా లేక ఎవరైనా తోసేశారా అని విచారిస్తున్నామని, బోగీలో ఉన్నవారిని సంప్రదిస్తున్నామని తెలిపారు.
హిమశ్రీపై లైంగిక దాడి జరగలేదు
ఏపీలో అనుమానాస్పదంగా మరణించిన అస్సాం యువతి హిమశ్రీ బోరో కేసులో కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు
ప్రాథమిక నివేదిక ఆధారంగా యువతిపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని నిర్ధారించామని, ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చాక పూర్తి స్పష్టత వస్తుందని తెలిపిన పోలీసు అధికారి
రైల్వే పోలీసుల హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఏ బోగీలో ఉందో చెప్పలేదని, శ్రీకాకుళం రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులు వెతికినా యువతి ఆచూకీ లభించలేదని వెల్లడి
రైలు నుంచి ప్రమాదవశాత్తు పడిపోయిందా లేక ఎవరైనా తోసేశారా అని విచారిస్తున్నామని, బోగీలో ఉన్నవారిని సంప్రదిస్తున్నామని తెలిపిన పోలీసులు
— Telugu Scribe (@TeluguScribe) October 11, 2026
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

