Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
KiaraAdvani | బాలీవుడ్ స్టార్ కపుల్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ఇటీవల తమ రెండో ప్రెగ్నెన్సీ గురించిన శుభవార్తను అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే.
Kiara Advani | బాలీవుడ్ స్టార్ కపుల్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ఇటీవల తమ రెండో ప్రెగ్నెన్సీ గురించిన శుభవార్తను అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రకటన వచ్చిన కొద్ది రోజులకే కియారా తన భర్త సిద్ధార్థ్, కూతురు సారాయాతో కలిసి వెళ్ళిన హాలిడే ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ చిత్రాలలో కియారా ముఖంలో కనిపిస్తున్న ‘మామా గ్లో’ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ వెకేషన్లో భాగంగా స్విమ్మింగ్ పూల్ దగ్గర సూర్యరశ్మిని ఆస్వాదిస్తూ, లేక్స్, కొండల మధ్య ప్రశాంతంగా గడుపుతున్న క్షణాలను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు.
పాప గోప్యతను దృష్టిలో ఉంచుకుని కియారా దంపతులు తమ కూతురి ముఖం కనిపించకుండా జాగ్రత్తపడుతున్నారు. ఇక అక్టోబర్ 7న కియారా, సిద్ధార్థ్ తమ మొదటి బిడ్డ సారాయా పుట్టిన కొద్ది నెలలకే రెండో సంతానం కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రకటించి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన కియారా, మాతృత్వం తనను వ్యక్తిగతంగా ఎంతో మార్చిందని, ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు తన కూతురు గురించే ఎక్కువగా ఆలోచిస్తానని తెలిపారు. సినిమాల విషయానికి వస్తే, మాతృత్వం తర్వాత కూడా ఆమె తన ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ, యష్‌తో కలిసి ‘టాక్సిక్’ చిత్రంలో కీలక పాత్రలో నటించి మెప్పించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

