AP News | గొడ్డలి పార్టీకి ప్రజలు సరైన బుద్ధి చెప్పారు.. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్
AP News | జగన్ ప్రభుత్వం కమీషన్ల కోసం పారిశ్రామికవేత్తలను వేధించి, రాష్ట్ర అభివృద్ధిని పాతాళానికి తొక్కేసిందని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం చీపుర్లపాడులో రూ.10.51 కోట్లతో నిర్మించనున్న ఎంఎస్ఎంఈ పార్కుకు ఆయన ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధికారంలో ఉండగా 'నాకెంత.. నీకెంత' అంటూ దోచుకున్న ఆ 'గొడ్డలి పార్టీ' కి గత ఎన్నికల్లో ప్రజలే సరైన బుద్ధి చెప్పారని, రాబోయే రోజుల్లో ఆ పార్టీ శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని జోస్యం చెప్పారు.
AP News : జగన్ ప్రభుత్వం కమీషన్ల కోసం పారిశ్రామికవేత్తలను వేధించి, రాష్ట్ర అభివృద్ధిని పాతాళానికి తొక్కేసిందని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం చీపుర్లపాడులో రూ.10.51 కోట్లతో నిర్మించనున్న ఎంఎస్ఎంఈ పార్కుకు ఆయన ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధికారంలో ఉండగా ‘నాకెంత.. నీకెంత’ అంటూ దోచుకున్న ఆ ‘గొడ్డలి పార్టీ’ కి గత ఎన్నికల్లో ప్రజలే సరైన బుద్ధి చెప్పారని, రాబోయే రోజుల్లో ఆ పార్టీ శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని జోస్యం చెప్పారు.
గత ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను ఆక్రమించుకోవాలని చూస్తే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు కేంద్రంతో మాట్లాడి రూ.15 వేల కోట్లు మంజూరు చేయించి ఉక్కు పరిశ్రమను కాపాడారని అచ్చెన్నాయుడు తెలిపారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ నాయకత్వంలో ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానంతో కేవలం 23 నెలల్లోనే రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించామని, యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే తమ ప్రథమ ప్రాధాన్యమని చెప్పారు.
శ్రీకాకుళం జిల్లాలో వలసలను అరికట్టేందుకు పరిశ్రమల స్థాపన అవసరమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. నియోజకవర్గ తాగునీటి సమస్యకు రూ.620 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. జిల్లా ప్రజల 60 ఏళ్ల కల అయిన ‘నేరడి బ్యారేజీ’ ని 2029 నాటికి వంద శాతం పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

