జైపూర్ : బీజేపీ పాలిత రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని జోత్వారా ప్రాంతంలో రోడ్ల దుస్థితి, మురుగునీరు, డ్రైనేజీ సమస్యలపై స్థానికులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. కొందరు వ్యోమగాముల వేషధారణలో కనిపించగా, మరోవైపు ఒక రాకెట్‌ను కూడాప్రదర్శనలో భాగంగా తీసుకొచ్చారు.
జోత్వారాలో అధ్వానంగా మారిన రోడ్లు, దెబ్బతిన్న డ్రైనేజీ వ్యవస్థతో విసిగిపోయిన స్థానికులు ఈ వినూత్న నిరసనకు దిగారు. రోడ్లపై ఇప్పుడు చంద్రుడు లేదా అంగారకుడి ఉపరితలం కంటే ఎక్కువ గుంతలు ఉన్నాయని వారు ఎద్దేవా చేశారు.నిరసనకు ఉపయోగించిన రాకెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని నిరసనకారులకు చలాన్ విధించారు.