అందాల భామ అనుష్క ఎంత సింపుల్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలోను ఈ అమ్మడు అంత యాక్టివ్‌గా ఉండదు. ఎప్పుడో ఒకసారి తన ఫీలింగ్స్ షేర్ చేస్తూ ఉంటుంది. అయితే రీసెంట్గా రానా తన సినిమా ప్రమోషన్లో భాగంగా అనుష్కకు స్పెషల్ గూడీస్ ని గిఫ్ట్ గా పంపినట్లు తెలుస్తోంది. దీనికి సంతోషించిన స్వీటీ . ఇన్స్టాగ్రామ్ వేదికగా .. ”థాంక్యూ రానా బ్రో.. నాకు ఇవి బాగా నచ్చాయి. ‘అరణ్య’ టీమ్ మొత్తానికి నా శుభాకాంక్షలు” అని పోస్ట్ పెట్టింది.
అరణ్య చిత్రం ఏనుగుల నేపథ్యంలో తెరకెక్కడంతో ఇండస్ట్రీకు చెందిన ప్రముఖుల అందరికి ఏనుగు బొమ్మలతో కూడిన గూడీస్ గిఫ్ట్‌గా పంపాడు రానా. అయితే రానా పంపిన గూడీస్ పక్కన తన పెట్ డాగ్ ని నిలబెట్టి అనుష్క ఫొటో తీసి షేర్ చేయడం విశేషం.ఈ పిక్ ఆకట్టుకుంటుంది. కాగా, అనుష్క-రానాలు బాహుబలి చిత్రంలో కలిసి నటించగా, ఆ సమయంలో వారిద్దరి మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది.