Sharwanand 38 | టాలీవుడ్ నటుడు శర్వానంద్ తన కెరీర్లో తొలి పాన్ ఇండియా చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. సంపత్ నంది ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. 1960ల చివర్లో ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో జరిగిన కథ ఆధారంగా ఈ సినిమా రాబోతుంది. మరపురాని అనుభూతిని కలిగించే పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రాబోతుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
ఇప్పటికే మూవీ కోసం పూర్తిగా మేకోవర్ అయ్యాడు శర్వానంద్. మే మొదటివారం నుంచి షూటింగ్ శరవేగంగా ప్రారంభంకాబోతుండగా.. ఈ సినిమా కోసం హైదరాబాద్ సమీపంలో 15 ఎకరాల్లో ఓ భారీ సెట్‌ను సిద్ధం చేశారు. ఇదిలావుంటే ఈ మూవీలో కథానాయికకు సంబంధించి సాలిడ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) నటించబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది. గతంలో శర్వానంద్, అనుపమ కలిసి శతమానం భవతి అనే సినిమాలో నటించారు. దిల్ రాజ్ నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ జోడి మళ్లీ జత కడుతుండడంతో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: సౌందర్ రాజన్.ఎస్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సమర్పణ: లక్ష్మీ రాధామోహన్, నిర్మాణం: శ్రీసత్యసాయి ఆర్ట్స్.
Warm Welcome @anupamahere to our #Sharwa38 World 🤗
The Soul of Our Soil
Looking forward✨#CharmingStar38
Charming Star @ImSharwanand @KKRadhamohan @KirankumarMann4 @SriSathyaSaiArt pic.twitter.com/Ui2tj6QuYu
— Sampath Nandi (@IamSampathNandi) April 26, 2025