Butterfly Movie On OTT | ఓ వైపు గ్లామర్ పాత్రలు పోషిస్తేనే.. మరోవైపు నటన ప్రాధాన్యమున్న పాత్రలతో మెప్పిస్తుంది మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరణ్. ఈ ఏడాది ‘రౌడీ బాయ్స్’తో మంచి ఆరంభం దక్కకపోయిన.. ద్వితియార్థంలో వచ్చిన ‘కార్తికేయ-2’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇటీవలే రిలీజైన ’18పేజీస్’తో మరో విజయం సాధించింది. ప్రస్తుతం ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. ఇక ఇదిలా ఉంటే అనుపమ నటించిన లేటెస్ట్ మూవీ బట్టర్ ఫ్లై నేరుగా ఓటీటీలో రిలీజైంది.
సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం గత రాత్రి నుండి హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ ఏడాది ప్రథమార్థంలోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్ డేట్ పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో హాట్‌స్టార్ నుండి మంచి ఆఫర్ రావడంతో మేకర్స్ ఓటీటీ వైపు మొగ్గుచూపారు. ఘంటా సతీష్‌బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిహాల్ కోదత్య్, భూమిక చావ్లా కీలక పాత్రల్లో నటించారు. జెన్ నెక్స్ట్ మూవీస్ బ్యానర్‌పై రవిప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరవళ్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.