Jatayu | ‘రామాయణం’లో జటాయువుగా అనుపమ్ ఖేర్!
Anupam Kher | నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రామాయణం' (Ramayana: Part 1) నుండి ఒక కీలకమైన అప్డేట్ బయటకు వచ్చింది.
Anupam Kher | నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణం’ (Ramayana: Part 1) నుండి ఒక కీలకమైన అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో ధైర్యానికి, ధర్మానికి ప్రతీక అయిన ‘జటాయువు’ పాత్రకు ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ తన గాత్రాన్ని (వాయిస్ ఓవర్) అందిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు చిత్ర బృందం జటాయువు పాత్రకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. రావణాసురుడు సీతాదేవిని అపహరించుకుపోతున్న సమయంలో, ఆమెను రక్షించడానికి జటాయువు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వీరోచితంగా పోరాడిన చారిత్రక ఘట్టం రామాయణంలో అత్యంత భావోద్వేగమైనది. ఈ శక్తివంతమైన పాత్రకు అనుపమ్ ఖేర్ వాయిస్ ఓవర్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
ఇదిలా ఉండగా, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 5, 2026 న థియేటర్లలో ఘనంగా విడుదల కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, యశ్ రావణాసురుడిగా మరియు సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రలలో నటిస్తున్నారు. సినిమాపై అంచనాలు భారీగా ఉండగా, దీనికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అక్టోబర్ 20వ తేదీన దసరా పండుగ సందర్భంగా ప్రారంభం కానున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jatayu | ‘రామాయణం’లో జటాయువుగా అనుపమ్ ఖేర్!
CPR | సీపీఆర్ అంటే ఏమిటి.. హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు ఇది ఎందుకు కీలకం..
రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీలకు భీమవరం విద్యార్థినులు
రవిచంద్ర కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే రేగా పరామర్శ
Abhijeet Dipke | ప్రధాని మోదీకి జ్ఞానేశ్‌కుమార్ ఎందుకంత ముఖ్యమో..? : అభిజీత్ దీప్కే
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

