రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీలకు భీమవరం విద్యార్థినులు
రాష్ట్రస్థాయి జూనియర్ ఖో-ఖో పోటీలకు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం భీమవరం గ్రామానికి చెందిన ఐదుగురు విద్యార్థినులు ఎంపికయ్యారు. ఈ నెల 11న కల్లూరు మినీ స్టేడియంలో నిర్వహించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ఖో-ఖో జట్టు ఎంపిక పోటీల్లో జిల్లా నుంచి....
ఎర్రుపాలెం, అక్టోబర్ 13 : రాష్ట్రస్థాయి జూనియర్ ఖో-ఖో పోటీలకు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం భీమవరం గ్రామానికి చెందిన ఐదుగురు విద్యార్థినులు ఎంపికయ్యారు. ఈ నెల 11న కల్లూరు మినీ స్టేడియంలో నిర్వహించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ఖో-ఖో జట్టు ఎంపిక పోటీల్లో జిల్లా నుంచి 70 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. వీరిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణులను ఖమ్మం జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సీహెచ్ ఉపేందర్, పీడీ నరాల సాంబశివారెడ్డి తెలిపారు.భీమవరం గ్రామంలోని వేమిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన శీల తేజశ్రీ, గండు రాధిక, తల్లపురెడ్డి సంజన, శీల శ్రావణి, వేమిరెడ్డి మౌనిక జిల్లా జట్టులో స్థానం సంపాదించారు.
ఎంపికైన విద్యార్థినులు ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగే 45వ రాష్ట్రస్థాయి జూనియర్ ఖో-ఖో పోటీల్లో పాల్గొననున్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరిచి గ్రామానికి, మండలానికి మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థినులను సర్పంచ్ వంగల నాగేశ్వరరావు, పాఠశాల హెచ్ఎం. సీహెచ్ ఉపేందర్, పీఈటి నరాల సాంబశివారెడ్డి, ఏఏపీసీ చైర్మన్ తులసమ్మ, గ్రామ పెద్దలు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, గ్రామస్తులు అభినందించారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీలకు భీమవరం విద్యార్థినులు
రవిచంద్ర కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే రేగా పరామర్శ
Abhijeet Dipke | ప్రధాని మోదీకి జ్ఞానేశ్‌కుమార్ ఎందుకంత ముఖ్యమో..? : అభిజీత్ దీప్కే
Congress MLA | ఈ గుడి మేము కట్టించాం.. దళితుడితో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనమామ వాగ్వాదం.. వీడియో
‘పట్టణ పరిశుభ్రతలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

