న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: పసిడి మళ్లీ పరుగందుకున్నది. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్యనెలకొన్న పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తతంగా మారడంతో పాటు అమెరికాలో నిరుద్యోగం పెరగడంతో అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. దీంతో దేశీయంగా ధరలు భారీగా పెరిగాయి.ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.510 అధికమై రూ.49,740 పలికింది. పసిడితోపాటు వెండి పరుగులు పెట్టింది. కిలో వెండి ధర రూ.190 అధికమై రూ.63,220కి చేరుకున్నది.
కానీ, హైదరాబాద్లో మాత్రం ధరలు తగ్గడం విశేషం. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.430 తగ్గి రూ.49,970కి చేరుకోగా, 22 క్యారెట్ల ధర రూ.400 తగ్గి రూ.45,800గా నమోదైంది. కిలో వెండి ధర రూ.200 పెరిగి రూ.68,800 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో 1,900 డాలర్లు పలికిన ఔన్స్ ధర 1,876 డాలర్ల స్థాయిలో కదలాడుతున్నది. వెండి ఫ్లాట్గా 23.58 డాలర్లుగా ఉన్నది.