బోడుప్పల్, జనవరి 8 : పారిశుధ్య కార్మికులకు 30శాతం వేతనాలు పెంచుతూ జీవో జారీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. శనివారం నగరపాలక సంస్థ కార్యాలయంలో మున్సిపల్ కార్మికులతో కలిసి ఆయన సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
అనంతరం పారిశుధ్య కార్మికులను సత్కరించారు. కార్మికుల సేవలు గుర్తించి వేతన పెంపుపై నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంటామని నగరపాలక, పురపాలక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటా వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.