Anni Manchi Shakunamule Movie Trailer | సంతోష్ శోభన్ కెరీర్ ఒక అడుగు ముందుకు వేస్తుంటే.. నాలుగు అడుగులు వెనక్కి పడుతుంది. కరోనా టైమ్‌లో వచ్చిన ‘ఏక్‌మినీ కథ’తో జనాలకు సంతోష్ పేరు బాగానే రిజిస్టర్ అయింది. బోల్డ్ కంటెంట్‌తో వచ్చి సక్సెస్ సాధించాడు. ఆ తర్వాత ఏకంగా మారుతితోనే సినిమా చాన్స్ పట్టేశాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లతో సంతోష్‌కు కాస్తో కూస్తో ఉన్న మార్కెట్ కూడా పోయింది. ప్రస్తుతం ఆయన ఆశలన్నీ ‘అన్నీ మంచి శకునములే’ సినిమా పైనే ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్ సినిమాపై మంచి బజ్నే క్రియేట్ చేసింది. తాజాగా ఎన్టీఆర్ ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశాడు.
లేటెస్ట్గా రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. ఇక ట్రైలర్‌తోనే మేకర్స్ సినిమా ప్లాట్ గురించి క్లారిటీ ఇచ్చేశారు. రెండు కుటుంబాల మధ్య శతృత్వం.. ఆ రెండు కుటుంబాల్లోని హీరో హీరోయిన్లు చిన్నపటి నుంచి ప్రేమలో ఉండటం.. ఇంట్లో ఉన్న గొడవల వల్ల వీళ్ల ప్రేమను చెప్పకపోవడం.. చివరికి ఏమైంది. వీళ్ల పెళ్లికి ఆ రెండు కుటుంబాలు ఒప్పుకున్నాయా? లేదా? అనే కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్‌తోనే స్పషం చేశారు. ఇప్పటికే ఇలాంటి స్టోరీలు మనం ఎన్నో చూశాం. అయితే నందిని రెడ్డి తన స్క్రీన్‌ప్లేతో ఏదో మాయ చేయబోతుందని ట్రైలర్‌తో హింట్ ఇచ్చేసింది. తెలిసిన కథే అయినా.. ఎంత బలంగా ఆ కథను చెప్పాను అనే రీతిలో ట్రైలర్‌ను అద్భుతంగా కట్ చేసింది. ముఖ్యంగా మిక్కీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్లింది.
మొత్తానికైతే ట్రైలర్ సినిమాపై మంచి హైపే తీసుకొచ్చింది. సంతోష్, మాళవిక కెమిస్ట్రీ బాగా కుదిరింది. అవుట్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాను స్వప్న సినిమాస్ బ్యానర్‌పై స్వప్న దత్ నిర్మించింది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ సినిమా మే 18న విడుదల కానుంది.