తమిళ అగ్రహీరో కార్తీ నటిస్తున్న యాక్షన్ కామెడీ అడ్వెంచర్ ‘వా వాతియార్’ సినిమా తెలుగులో ‘అన్నగారు వస్తారు’ పేరుతో విడుదల కానుంది. కృతి శెట్టి కథానాయిక. నలన్ కుమారస్వామి దర్శకత్వంలో కె.ఇ.జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ని అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి తన సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు. పోలీస్ ఆఫీసర్ కార్తీ ఎంట్రీని గ్రామస్తులు సెలబ్రేట్ చేస్తుండగా టీజర్ మొదలైంది.
వారితో కలిసి కార్తీ కూడా ఫుల్‌జోష్‌తో డ్యాన్స్ చేస్తూ ైస్టెలిష్‌గా ఎంట్రీ ఇచ్చారు. సెలబ్రేషన్స్ జరుగుతుండగానే.. కృతిశెట్టి, సత్యరాజ్, ఆనంద్‌రాజ్, రాజ్‌కిరణ్ పాత్రలు పరిచయమయ్యాయి. అలాగే పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్లతోనూ టీజర్ ఆకట్టుకున్నది. మధుర్ మిట్టల్, శిల్పా మంజునాథ్, కరుణాకరణ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జార్జ్ సి.విలియమ్స్, సంగీతం: సంతోష్ నారాయణన్, నిర్మాణం: స్టూడియో గ్రీన్.