‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ అఖిల్‌రాజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అర్జునుడి గీతోపదేశం’. సతీష్ గోగాడ దర్శకత్వంలో త్రిలోక్‌నాథ్ కాళిశెట్టి నిర్మిస్తున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రధారి.
హైదరాబాద్, అమలాపురం పరిసర ప్రాంతాల్లో ఇప్పటివరకు ఎనభైశాతం చిత్రీకరణ పూర్తిచేశామని, డిసెంబర్లో చివరి షెడ్యూల్ మొదలవుతుందని మేకర్స్ తెలిపారు. దివిజ ప్రభాకర్, ఆదిత్య శశికుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చరణ్‌అర్జున్, దర్శకత్వం: సతీష్ గోగాడ.