ఖిలా వరంగల్: నగరంలోని శివనగర్ వాసవి లైన్లో వినాయక ట్రస్ట్ భవన్ ఆధ్వర్యంలో ఆదివారం గణపతి స్వామికి విశేష పూజలు ( Ganesh festival ) నిర్వహించారు. నిత్యం భజనలు ,సంకీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో గణనాధునికి మంగళ నిరాజనాలు అర్పిస్తున్నారు. గత శుక్రవారం వినాయక మండపాన్ని రూ.1.53 కోట్ల కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం కరెన్సీ నోట్లకు ధనలక్ష్మి పూజ చేశారు. ఆదివారం మహా అన్నదాన ప్రసాద ( Annaprasadam ) వితరణ చేపట్టడంతో స్థానికులు భారీగా తరలివచ్చారు. కరెన్సీ గణనాథుని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.