హుజూరాబాద్, అక్టోబర్ 27: వెన్నుపోటుదారుడు ఈటల రాజేందర్‌కు ఉప ఎన్నికలో హుజూరాబాద్ ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని టీఆర్ఎస్ ఎన్నారై సెల్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో బుధవారం విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. వారం రోజులుగా నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నామని తెలిపారు. గెల్లు గెలుపు ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి, అభివృద్ధి, సంక్షేమాన్ని ఆదరించాలని కోరారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీజేపీ కొత్త నాటకాలకు తెర లేపి, సానుభూతి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నదని, ప్రజలు దీనిని గమనించాలన్నారు.