ఒకనాటి బాలీవుడ్ సూపర్‌స్టార్ అనిల్‌కపూర్ ‘యానిమల్’తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. అగ్ర హీరోల సినిమాల్లో ప్రాధాన్యత గల పాత్రలకు దర్శక,నిర్మాతలు కూడా అనిల్‌కపూర్ వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్, ప్రశాంత్‌నీల్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే.. మరో ప్రతిష్టాత్మక తెలుగు సినిమాలోనూ అనిల్‌కపూర్ భాగం కానునట్టు ఫిల్మ్ వర్గాల్లో ఓ వార్త బలంగా వినిపిస్తున్నది.
అగ్ర హీరో చిరంజీవి కథానాయకుడిగా కేఎస్ రవీంద్ర(బాబీ) తెరకెక్కించనున్న చిత్రంలో అనిల్‌కపూర్ కీలక పాత్ర పోషించనున్నారట. ఇటీవలే బాబీ ఆయనకు కథ వినిపించడం, పాత్ర నచ్చడంతో అనిల్ ఓకే చెప్పడం జరిగిపోయిందని ఫిల్మ్‌నగర్ టాక్. ఇప్పటికే ఈ సినిమాలో మోహన్‌లాల్ నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇప్పుడు అనిల్ కూడా తోడైతే పానిండియా మార్కెట్‌కి ఢోకా ఉండదంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.