Anikha Surendran | ది ఘోస్ట్ సినిమాలో కీలక పాత్రలో మెరిసింది అనిఖా సురేంద్రన్ (Anikha Surendran). ఆ తర్వాత బుట్టబొమ్మ సినిమాతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులను పలుకరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. తెలుగుదనం ఉట్టిపడేలా కనిపించే ఈ భామ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందంటే.. క్రేజ్ మామూలుగా ఉండదు. ప్రొఫెషనల్ కమిట్మెంట్స్తో బిజీగా ఉండే ఈ భామ వెకేషన్ టూర్ ప్లాన్ చేసింది.
ఇంతకీ అనిఖా సురేంద్రన్ ఎక్కడికెళ్లిందనుకుంటున్నారా..? పాపులర్ టూరిజం డెస్టినేషన్ స్పాట్ మాల్డీవులు (Maldives).ఎక్కువగా సంప్రదాయ వస్త్రధారణలో మెస్మరైజ్ ఈ భామ తాజాగా తనలోని ట్రెండీ స్టైల్‌ను అందరికి పరిచయం చేస్తూ.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. గ్రే టాప్, బ్లాక్ షార్ట్స్, గాగుల్స్ పెట్టుకున్న అనిఖా సురేంద్రన్ చేతిలో కొబ్బరిబోండా పట్టుకొని బీచ్‌లో చిట్ అవుట్ అవుతున్న లుక్స్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.
అనిఖా సురేంద్రన్ మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తోన్న కింగ్ ఆఫ్ కోటలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. దీంతోపాటు తమిళంలో రెండు సినిమాలు చేస్తోంది.

Anikha Surendran1

Anikha Surendran2
బీచ్‌లో షికారు ఇలా..
— Anikha Surendran (@Anikha_Actress) June 19, 2023